అనుష్క నటనకు మంచి మార్కులు పడ్డాయి !

అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా అనుష్క నటనకు మంచి మార్కులు పడ్డాయి. తరువాత తమన్ అందించిన నేపధ్య సంగీతం, రవీందర్ ఆర్ట్ వర్క్ బాగున్నాయని అంటున్నారు.

విడుదలకు ముందు నుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు ఉన్నాయి. ‘అరుంధతి, బాహుబలి’ లాంటి సినిమాల చేసిన అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహించగా యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిచింది.