టీజర్ తో అంచనాలు పెంచేసిన ‘మై డియర్ మార్తాండం’ !

Published on Jul 21, 2018 3:02 pm IST


ప్రముఖ హాస్య నటుడు 30ఇయర్స్ పృథ్వి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మై డియర్ మార్తాండం’. నూతన దర్శకుడు కే వి హరీష్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం యొక్క టీజర్ ఈ రోజు విడుదలచేశారు. 30 రోజుల్లో లాయర్ అయ్యి కోర్టులో కేసులను ఎలగెలిపించాడనే కథ తో తెరకెక్కుతుంది ఈచిత్రం. ఇక టీజర్ తో లాయర్ గెటప్ లో పృథి తన కామెడీ తో అక్కట్టుకున్నాడు. క్లీన్ కామెడీ తో ఒక మంచి టీజర్ ను వదిలి చిత్రం ఫై అంచనాలు పెంచేశారు చిత్ర యూనిట్.

ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో జయప్రకాష్ రెడ్డి , తాగుబోతు రమేష్ , కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మజిన్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రం ఆగష్టు లో ప్రేక్షకులముందుకు రానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More