అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ సినిమా తెరకెక్కుతోంది. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఈరోజు రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేశారు. ‘సైనికా’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ బాగున్నాయి. దేశ భక్తి గల యువకుడిగా అల్లు అర్జున్ నటన ఈ సినిమాకు హైలెట్ గా ఉండబోతోంది.
విశాల్ శేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో బలం కానుంది. అను ఇమ్మానుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 14 న ఈ సినిమా రెండో పాటను విడుదల చేయబోతున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా చిత్రాన్ని ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.
