“శ్రీదేవి చిరంజీవి” సాంగ్ కి సూపర్ రెస్పాన్స్!

“శ్రీదేవి చిరంజీవి” సాంగ్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Dec 20, 2022 10:56 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి నిన్న శ్రీదేవి చిరంజీవి అనే సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ సాంగ్ కి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటకి ఇప్పటి వరకూ 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం లో మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి రాక్ స్టార్ డిఎస్పీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు