‘రుద్రమదేవి 3డి’ ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్

‘రుద్రమదేవి 3డి’ ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్

Published on Mar 1, 2015 7:58 PM IST

rudramadevi1
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి 3డి’. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా స్టీరియో స్కోపిక్ మెథడ్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ చిత్ర టీం ఫిబ్రవరి 28న ప్రసాద్ ఐ మాక్స్ లో కొంతమందికి ట్రైలర్ ని వేసి చూపించారు.

చూసిన ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో చెబుతున్న మాట సూపర్బ్ గా ఉందని అంటున్నారు. కొందరేమో విజువల్ ఎఫెక్ట్స్ ని మెచ్చుకుంటే కొందరేమో గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ అదర గొట్టాడని, మరోకొందరేమో అనుష్క సెట్టింగ్స్ అదిరిపోయాయని అంటున్నారు. త్వరలోనే ఈ ట్రైలర్ ని సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు