‘రాజా సాబ్’ విషయంలో ఫైనల్ గా గుడ్ స్టెప్!

‘రాజా సాబ్’ విషయంలో ఫైనల్ గా గుడ్ స్టెప్!

Published on Jan 10, 2026 7:06 AM IST

The Raja Saab

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ది రాజా సాబ్ (The Raja Saab). మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఒకింత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సాలిడ్ బుకింగ్స్ ని అయితే చూపిస్తుంది. అయితే ప్రీమియర్స్ ఇంకా డే 1 సినిమా చూసిన అభిమానులు ఒక్క విషయంలో బాగా డిజప్పాయింట్ అయ్యారు.

అసలు సినిమాలో చూద్దాం అనుకున్న ప్రభాస్ ఓల్డేజ్ లుక్ సీన్స్ మొత్తాన్ని తీసేయడం ట్విస్ట్ గా మారింది. దీనితో పాటుగా మరికొన్ని సీన్స్ తొలగించడం ఫ్యాన్స్ కి దారుణంగా డిజప్పాయింట్ చేయగా ఫైనల్ గా దీనిని మేకర్స్ ఫీడ్ బాక్ గా తీసుకొని ఇవాళ్టి నుంచే థియేటర్స్ లోకి యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కాకుంటే రేపటి నుంచి అయినా ప్రింట్స్ లో అప్డేట్ చేస్తారట. సో ఇది మాత్రం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు