వైరల్ : గూగుల్ లో “RRR” టీం కి ఊహించని సర్ప్రైజ్.!

Published on Aug 13, 2022 5:00 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యాక అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయింది.

ఇక ఇప్పుడు వరల్డ్ వైడ్ భారీ రీచ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇంకా అనేక రివార్డులు రికార్డులు అందుకుంటుండగా ఓ ఇంట్రెస్టింగ్ అంశం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో జస్ట్ RRR అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కింద సమాచారం తో పాటుగా హీరోల గుర్రం మరియు బైక్ ఎమోజీలు యానిమేషన్ లో అలా స్లైడ్ అవుతూ వెళ్లిపోతున్నాయి. దీనితో ఈ సర్ప్రైజింగ్ అంశాన్ని RRR టీం వారు సోషల్ మీడియాలో షేర్ చేసుకొని గూగుల్ కి థాంక్స్ చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :