టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతున్న ఈ సినిమాలో ఇంకా 20 రోజులపైన షూటింగ్ పార్ట్ బాలన్స్ ఉంది. దాంతో ఈ చిత్ర టీం చాలా ఫాస్ట్ గా సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.
కానీ కొద్ది రోజులుగా షూటింగ్ బాలన్స్ ఉండడం వలన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావడం లేదని కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన శరత్ మరార్ సినిమా కచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం చాలా స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నామని తెలిపాడు.
బాలీవుడ్ సూపర్ హిట్ హిందీ మూవీ ‘ఓ మై గాడ్’ కి ఇది రీమేక్. మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపించనున్న వెంకటేష్ కి జోడీగా శ్రియ శరన్ కనిపించనుంది. కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


