షూటింగ్ చివరి దశలో ‘గోపాల గోపాల’.

షూటింగ్ చివరి దశలో ‘గోపాల గోపాల’.

Published on Nov 6, 2014 3:43 PM IST

Gopala_Gopala_Movie
విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలసి నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇటివల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన షెడ్యూల్ లో భూకంపం సంభవించే సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. కాశీ(వారణాసి) షెడ్యూల్ తో పాటు రెండు పాటల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. త్వరలో వీటి షూటింగ్ పూర్తి చేయనున్నారు.

వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్నారు. కిషోర్ పార్దసాని (డాలి) దర్శకుడు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఓ మై గాడ్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు