యాక్షన్ హీరో గోపీచంద్ వరుసగా కొన్ని పరాజాయాల తర్వాత ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కుమార్ అనే ఓ నూతన దర్శకుడి దర్శకత్వంలో గోపీచంద్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రధానంగా లవ్ ఎంటర్టైనర్ తో కూడుకున్న యాక్షన్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఐతే ఈ చిత్రం తర్వాత గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం సంపత్ నంది చెప్పిన లైన్ ఇప్పటికే ఓకే చేసిన గోపిచంద్ కి ఫుల్ స్క్రిప్ట్ కూడా బాగా బాగా నచ్చిందట. ఇక ఈ సినిమా అక్టోబర్ నుంచి పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడట. మరి ఈ సారి హిట్ ఇస్తాడేమో చూడాలి.
