గోపిచంద్ మలినేని సెటిమెంట్ బలంగా ఫాలో అవుతున్నారు

Published on Jun 12, 2021 1:59 am IST

మన హీరోలకి, దర్శకులకి సెంటిమెంట్లు ఎక్కువ. ఒక సినిమా హిట్ అయితే వాటి విషయంలో ఫాలో అయిన అంశాలనే తర్వాతి సినిమాలకి కూడ ఫాలో అవుతుంటారు. ప్రజెంట్ గోపిచంద్ మలినేని ఇదే తరహాలో తన సెంటిమెంట్స్ రిపీట్ చేస్తున్నారు. ఆయన తన తర్వాతి సినిమాను నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా విషయంలో తన గత చిత్రం ‘క్రాక్’ సెటిమెంట్స్ రిపీట్ చేస్తున్నారు గోపిచంద్. ‘క్రాక్’ చిత్రానికి సంగీతం అందించిన తమన్ చేతుల మీదుగానే బాలయ్య సినిమాకు సంగీతం చేయించుకుంటున్నారు.

అలాగే ‘క్రాక్’ చిత్రంలో చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ను బాలకృష్ణ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ‘క్రాక్’లో లేడీ విలన్ జయమ్మగా వరలక్ష్మి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈసారి కూడ ఆమె కోసం మంచి బలమున్న పాత్రను రాశారట ఆయన. ఇక బాలయ్య సరసన కథానాయికగా కూడ ‘క్రాక్’ ఫేమ్ శృతి హాసన్ ను తీసుకోవాలనేది గోపిచంద్ మలినేని కోరిక. అందుకోసం ఆయన గట్టిగానే ట్రై చేస్తున్నారట. శృతి హాసన్ వైపు నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఆమె కూడ ఒప్పేసుకుంటే గోపిచంద్ మలినేనికి సెంటిమెంట్స్ అన్నీ కుదిరినట్టే.

సంబంధిత సమాచారం :