ఆ దర్శకుడితో గోపీచంద్ !

27th, December 2017 - 08:39:44 AM

మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకరు. ఆక్సిజన్ సినిమాతో ఈ మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో తాజాగా చక్రి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా గోపీచంద్ కు 25 వ సినిమా అవ్వడం విశేషం. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాతో పాటు గోపీచంద్ మరో సినిమా చెయ్యబోతునట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్ళితే.. బిందాస్, రగడ చిత్రాలకు దర్శకత్వం వహించిన వీరుపోట్ల దర్శకత్వంలో గోపీచంద్ నటించబోతున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు.