యాక్షన్ హీరో సినిమాకి అదిరిపోయే క్లాసిక్ టైటిల్.

Published on Jun 9, 2019 11:55 am IST

గోపి చంద్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ పై ఇండస్ట్రీలో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఆ పుకార్లన్నిటికీ తెరదించుతూ చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. “చాణక్య” అనే ఓ క్లాసిక్ టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టడం జరిగింది. తెలివిగా ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసే వారిని చాళుక్యుడి తో పోలుస్తారు. గోపి చంద్ కూడా విలన్స్ ప్లాన్స్ ని చిత్తుచేస్తూ, ప్రత్యర్థులను ఆటాడుకునే ఇంటెలిజెంట్ హీరో గా చేస్తున్నారేమో చూడాలి.

దర్శకుడు తిరు ఇప్పటికే ఈ మూవీ సాగ భాగం షూటింగ్ పూర్తి చేసాడట. ఇండో-పాక్ బోర్డర్ లో చిత్రీకరణ సమయంలో గోపి చంద్ కి గాయం కావడంతో ఈ మూవీ షూటింగ్ కొంచెం ఆలస్యం ఐయిందని సమాచారం. తదుపరి షెడ్యూలు హైదరాబాద్ లో త్వరలో మొదలుపెట్టనున్నారు. గోపి చంద్ కి జంటగా ‘ఎఫ్2’ భామ మెహ్రీన్ నటిస్తుండగా , ఏ కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More