గోపీచంద్, మెహ్రీన్ లు జంటగా నూతన దర్శకుడు చక్రి తెరకెక్కించిన చిత్రం ‘పంతం’. గోపీచంద్ 25 వ సినిమా గా ఈ నెల 5 న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి యావరేజ్ టాక్ ను తెచ్చుకోవడంతో కలెక్షన్స్ కూడా యావరేజ్ గా ఉన్నాయి. ఈచిత్రం ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 9.20 కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. గోపిచంద్ గత 5 సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం పర్వాలేదనిపించే వసూళ్లను సొంతం చేసుకుంది.
మంచి సోషల్ కాజ్ తెరకెక్కిన ఈ చిత్రం రొటీన్ సన్నివేశాలతో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం ఫై రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిచారు.


