ఖరీదైన లొకేషన్లలో గోపీచంద్ సినిమా !

Published on May 26, 2018 7:22 pm IST


మ్యాచో మాన్ గోపీచంద్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘పంతం’. ‘ఆక్సిజన్, గౌతమ్ నంద’ వంటి చిత్రాలు వరుస పరాజయాలుగా నిలవడంతో గోపీచంద్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. నూతన దర్శకుడు కె.చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో ఇంకొంత టాకీ పార్ట్, మూడు పాటలు మాత్రం మిగిలి ఉన్నాయి.

ఈ మూడు పాటల్ని ఈ నెల 29వ తేదీ నుండి లండన్, స్కాట్లాండ్ దేశాల్లోని ఖరీదైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి చేస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. జూలై 5వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రంలో గోపీచంద్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :