‘సిటీమార్’ నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Jun 20, 2021 4:02 am IST

టాలెంటెడ్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అంటేనే మంచి టైమింగ్ ఉన్న కమెడియన్. కాగా గోపీచంద్‌ హీరోగా దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్ లో రానున్న ‘సిటీమార్’ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి ఫుల్ కామెడీ క్యారెక్టర్ చేశాడట. ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ తమన్నా అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారట. ఆ పాత్రలోనే శ్రీనివాస్ రెడ్డి నటిస్తున్నాడట.

అలాగే వెన్నల కిశోర్, సప్తగిరి లాంటి కమెడియన్స్ కూడా ఈ సినిమాలో అలరించనున్నారు. మరి వీరు అంతా ఈ చిత్రంతో ఎలాంటి నవ్వులు పూయిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట. ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే పట్టుదలతో సినిమా చేశాడట సంపత్ నంది.

సంబంధిత సమాచారం :