యాక్షన్ హీరో మళ్లీ తండ్రి అయ్యాడు !

Gopichand11

టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపీచంద్‌. కాగా ఆయన అభిమానులు ఆనందించే విషయం ఈ రోజు ఆయన జీవితంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గోపిచంద్ మళ్లీ తండ్రి అయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన సతీమణి రేష్మా ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. గోపీచందే స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపారు.

గోపీచంద్ ట్వీట్ చేస్తూ.. ‘మళ్లీ మాకు పండంటి బాబు పుట్టాడు. వినాయక చవితి పర్వదినాన ఇంతకు మించి బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ ఇంకోటి ఉండదు’ అని ఆయన పోస్ట్ చేశారు. గోపీచంద్ ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కుమార్ అనే ఓ నూతన దర్శకుడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ప్రధానంగా లవ్ ఎంటర్టైనర్ తో కూడుకున్న యాక్షన్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఐతే ఈ చిత్రం తర్వాత గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

Exit mobile version