యాక్ష‌న్‌లోకి దిగనున్న గోపీచంద్ !

Published on Jun 4, 2019 8:08 pm IST

మ్యాచో మ్యాన్ గోపీచంద్ కొన్ని నెలల క్రితం దర్శకుడు తిరు డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా మొదటి షెడ్యూల్ రాజస్థాన్ ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో సెట్లో జరిగిన ప్రమాదంలో గోపీచంద్ గాయపడ్డారు. దాంతో చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇన్నిరోజులు రెస్ట్ తీసుకున్న ఆయన పూర్తిగా కోలుకున్నారు. దీంతో చిత్ర యూనిట్ తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

ఈ నెల 7 నుండి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఇందులో కూడా యాక్షన్ సన్నివేశాలనే ప్రధానంగా చిత్రీకరిస్తారట. ఇందులో గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. గత చిత్రం ‘పంతం’ పరాజయం పొందడంతో ఈ సినిమాపైనే గోపీచంద్ ఆశలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :

More