మరో వైవిధ్యమైన కథతో యాక్షన్ హీరో !

మరో వైవిధ్యమైన కథతో యాక్షన్ హీరో !

Published on Dec 16, 2019 7:03 AM IST

యాక్షన్ హీరో గోపీచంద్ కి సరైన సక్సెస్ లేక ఆయన కెరీర్ గత కొన్నాళ్ళుగా ఒడిదుడుకుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరచడంతో గోపీచంద్ ప్రస్తుతం అయోమయంలో పడిపోయాడట. అయితే గోపీచంద్ తన పాత దర్శకుడు తేజతో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. తేజతో చేసిన ‘జయం, నిజం’ చిత్రాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈ సారి హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేసి హిట్ అందుకోవాలని చూస్తున్నాడట. ఇటు తేజ సైతం తనకిష్టమైన గోపీచంద్‌తో కలిసి వర్క్ చేయడానికి సుముఖంగానే ఉన్నారని, ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. గోపీచంద్ కోసం తేజ ఓ వైవిధ్యమైన కథను రాశాడని.. పూర్తిగా పాత్ర బలంతో నడిచే ఆ స్క్రిప్ట్ కూడా గోపీచంద్ కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది.

కాగా అన్నీ కుదిరితే వచ్చే యేడాది వీరి ప్రాజెక్ట్ పట్టాలైక్కే అవకాశముంది. ఇకపోతే గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో రానున్న సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమాగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది. బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో సాగే ఈ సినిమా బడ్జెట్ ను తగ్గించే ఆలోచనలో ఉందట చిత్రబృందం. చాణక్య రిజల్ట్ చూశాక.. సినిమాకి ఓవర్ బడ్జెట్ పెట్టి అది రాబట్టలేక చివరికి ప్లాప్ అనిపించుకోవడం గోపీచంద్ ఇష్టపడట్లేదని.. అందుకే ముందుగానే సాధ్యం అయినంతవరకు బడ్జెట్ తగ్గించమని గోపీచంద్ దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు