గోపీచంద్ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు !
Published on Mar 12, 2018 10:30 pm IST

గోపీచంద్ ప్రస్తుతం నూతన దర్శకుడు చక్రితో ‘పంతం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమా గోపీచంద్ కు 25 వ సినిమా. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది మే 18న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా తరువాత గోపీచంద్ చెయ్యబోతున్న సినిమా గురించి రకరకాల వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం మేరకు ఈ హీరో డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. గతంలో ఈ నిర్మాత గోపీచంద్ తో ‘సాహసం’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం మార్చి 18న ప్రారంభం కానుంది.

 
Like us on Facebook