గోపిచంద్ కొత్త సినిమా లాంచ్ !

Published on Mar 27, 2019 5:18 pm IST

ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో యాక్షన్ హీరో గోపిచంద్ నటించనున్న కొత్త చిత్రం ఈ రోజు లాంచ్ అయ్యింది. నూతన దర్శకుడు బిను సుబ్రమణ్యం డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రానికి సతీష్ కురుపు సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక గోపీచంద్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ తీరు తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. మే రెండవ వారంలో ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :

More