జోరు మీదున్న గోపీచంద్

జోరు మీదున్న గోపీచంద్

Published on Dec 6, 2015 4:39 PM IST

gopi-chand
సాహసం, లౌక్యం, జిల్ ఇలా వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్న మాచో హీరో గోపీచంద్ అప్పుడే తన తదుపరి సినిమా ‘సౌఖ్యం’ షూటింగ్ ని ఫినిష్ చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్న గోపీచంద్ ‘సౌఖ్యం’ ఆడియోని డిసెంబర్ 13న, సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా అలా రిలీజ్ అవుతుందో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోవడానికి సిద్దమయ్యాడు.

శ్రీ సూర్య మూవీస్ అధినేత ఎఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ చెప్పిన కథకి ఇటీవలే గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇది వరకే తెలియజేశాం. జ్యోతి కృష్ణ ఫైనల్ స్క్రిప్ట్ ని కూడా సిద్దం చేసి గోపీచంద్ కి వినిపించడం, దానికి కూడా గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా షూటింగ్ మొదలెట్టడానికి ఫిక్స్ అయిపోయాడు. సౌఖ్యం రిలీజ్ అయ్యి పోస్ట్ ప్రమోషన్స్ పూర్తయ్యి ఖాళీ అవ్వగానే అనగా జనవరి నుంచి జ్యోతికృష్ణ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేలా గోపీచంద్ ప్లాన్ చేసాడు. భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో ఉంది ఈ చిత్ర టీం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు