‘పక్కా కమర్షియల్’కు బ్రేకులు పడ్డాయి

Published on Apr 20, 2021 12:00 am IST

‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతి చాలా రోజుల గ్యాప్ తర్వాత గోపీచంద్ హీరోగా ఒక సినిమాను స్టార్ట్ చేశారు. అదే ‘పక్కా కమర్షియల్’. పలువురు హీరోల కోసం ప్రయత్నించి ప్రయత్నించి చివరకు ఈ సినిమాను పట్టాలెక్కించారు ఆయన. చాలా వేగంగా సినిమాను చేస్తూ వచ్చారు అయన. కానీ కరోనా సెకండ్ వేవ్ మారుతి వేగానికి బ్రేకులు వేసింది.

చిత్రీకరణను ప్రజెంట్ హోల్డ్ చేసి పెట్టారు. కరోనా కేసులు తగ్గాకనే చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది. ఒకవేళ షూటింగ్ మొదలైనా కూడ థియేటర్ల మూసివేత, టికెట్ ధరల తగ్గింపు లాంటి సమస్యలు ఉండటం అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయ్యేలా లేదు. ఇకపోతే గోపీచంద్ కొత్త సినిమా ‘సీటిమార్’ కూడ వాయిదాపడేలానే ఉంది. చూడబోతే గోపీచంద్ సినిమాలు థియేటర్లలోకి రావడం కొంచెం ఆలస్యమయ్యేలానే ఉంది.

సంబంధిత సమాచారం :