
బర్త్ డే బాయ్ అండ్ ఈ రోజు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన హీరోగా నటిస్తున్న తదుపరి సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా న్యూ షెడ్యూల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఎండ్ నుంచి హైదరాబాద్ లో మొదలు కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ స్టెప్స్ వేయనుంది. ఆ హాట్ బ్యూటీనే లక్ష్మీ రాయ్/ రాయ్ లక్ష్మీ.
కాంచన, అధినాయకుడు, బలుపు(స్పెషల్ అప్పియరెన్స్) సినిమాలలో కనిపించిన లక్ష్మీ రాయ్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో ఓ స్పెషల్ రోల్ చేయనున్నట్లు తెలిపింది. ‘పవన్ కళ్యాణ్ సర్దార్ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాను, అలాగే పవన్ తో కలిసి ఓ పాటలో డాన్స్ కూడా వేయనున్నాను. నా తెలుగు ఫ్యాన్స్ కి ఇదొక పెద్ద ట్రీట్ అని’ లక్ష్మీ రాయ్ తెలిపింది. కథ ప్రకారం సర్దార్ లో ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి. అందులో మెయిన్ హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేసారు. మరి లక్ష్మీ రాయ్ సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తుందా లేక స్పెషల్ అప్పియరెన్స్ మాత్రమేనా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాత. బర్త్ డే కానుకగా గత రాత్రి రిలీజ్ అయిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

