జూన్ 26న ప్రేక్షకుల ముందుకు ‘గాసిప్’.. ట్రైలర్ విడుదల

జూన్ 26న ప్రేక్షకుల ముందుకు ‘గాసిప్’.. ట్రైలర్ విడుదల

Published on Jun 23, 2026 8:00 AM IST

రాశి సింగ్ ప్రధాన పాత్రలో వైభవ్ కౌండిన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాసిప్’. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి రేమెళ్ల నిర్మించిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి తాజాగా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఒక చిన్న మాట లేదా పుకారు ఇతరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఇతివృత్తంతో, సామాజిక అంశాలకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు వైభవ్ కౌండిన్య తెలిపారు. ఇది తన కెరీర్‌లో తొలి మహిళా ప్రధాన చిత్రమని, ఒక మంచి సందేశంతో పాటు వినోదం కూడా ఉంటుందని నటి రాశి సింగ్ పేర్కొన్నారు. ఇందులో రవివర్మ, మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, గురు చరణ్ కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించగా, సతీష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. సమాజంలో జరిగే వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని చిత్ర నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు