పవన్ హీరోయిన్ పై కొనసాగుతున్న గాసిప్స్.!

Published on Jun 25, 2021 10:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అలాగే మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్.. అయితే మళయాళ సూపర్ హిట్ చిత్రం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మన దగ్గర కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే దర్శకుడు సాగర్ చంద్ర ఒరిజినల్ వెర్షన్ ను మరింత బెటర్ చేస్తూ అనేక కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే.

అలా ఇద్దరు స్టార్ హీరోలకి కూడా హీరోయిన్స్ ని పెట్టారు అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా తయారు చేసారని తెలిసింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అన్న దానిపై కొన్నాళ్ల నుంచి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా నిత్యా మీనన్ దగ్గర ఆగగా మళ్ళీ స్టార్ హీరోయిన్ సమంతా పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా సామ్ నేమ్ రేస్ లో ఉన్నట్టు మళ్ళీ గాసిప్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

సంబంధిత సమాచారం :