‘‘దేవరకొండ ఫౌండేషన్”కు నిర్మాత విరాళం !

Published on May 9, 2021 7:13 pm IST

హీరో విజయ్ దేవరకొండ పేదలకు మరియు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలనే సదుద్దేశ్యంతో స్థాపించిన ‘‘దేవరకొండ ఫౌండేషన్”కు ప్రముఖ నిర్మాత గొట్టిముక్కల పాండురంగారావు 2 లక్షలను విరాళంగా ఇచ్చారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నేడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీని కలిసి రెండు లక్షల రూపాయిలను అందజేశారు.

ఇక గత ఏడాది కరోనా విపత్తు సంభవించిన సమయంలో విజయ్ దేవరకొండ తనదైన సాయం చేసేందుకు దేవరకొండ ఫౌండేషన్ స్థాపించి, ఆ సమయంలో ఎంతోమందికి సాయం చేశాడు. పైగా కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో విజయ్ సిసిసికి భారీవిరాళం కూడా అందజేశాడు. ప్రస్తుతం ఉన్న కరోనా సెకెండ్ వేవ్ కఠిన పరిస్థుతులలో కూడా దేవరకొండ ఫౌండేషన్ పేదలకు సాయాన్ని అందిస్తూ ముందుకు వెళ్తుంది.

అలాగే మిత్రులు శ్రేయోభిలాషుల ద్వారా సేకరించిన నిధితోనూ విజయ్ బాధితులకు సాయం అందిస్తున్నాడు. ప్రస్తుతం ‘లైగర్’తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విజయ్ దేవరకొండకు అక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తుంది.

సంబంధిత సమాచారం :