‘గోవిందుడు అందరి వాడేలే’ అంటున్న రామ్ చరణ్

Published on Mar 27, 2014 8:27 am IST

Ram-Charan
గత కొన్ని రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త మూవీ టైటిల్ విషయంలో వస్తున్న వార్తలకి తెరపడింది. చిరవరగా ఈ మూవీకి ‘గోవిందుడు అందరి వాడేలే’ టైటిల్ ని ఖరారు చేసారు. కృష్ణ వంశీ డైరెక్షన్లో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఈ టైటిల్ బాగా సరిపోయింది.

ఏప్రిల్ 2వ వారం నుండి ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీల్లో జరుపుకోనుంది. ఈ సినిమా బాగా వస్తుండడంతో ప్రొడక్షన్ టీం చాలా హ్యాపీ గా ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

రామ్ చరణ్ కి శ్రీ కాంత్ బాబాయ్ గా కనిపించనున్న ఈ ‘గోవిందుడు అందరి వాడేలే’ లో చరణ్ కి తాతగా తమిళ్ యాక్టర్ రాజ్ కిరణ్ కనిపించనున్నాడు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్ళలో ఉంటుందని ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :