మళ్ళీ పొల్లాచ్చి వెళ్లనున్న ‘గోవిందుడు అందరివాడెలే’

Published on Jul 8, 2014 4:38 pm IST

Govindudu-Andarivadele
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జూలై 13 నుంచి పొల్లాచ్చి లో ప్రారంభం కానుంది. అక్కడ 10 రోజులు షూటింగ్ చేయనున్నారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులకి అందించాలనే ఉద్దేశంతో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా విజువల్స్ పరంగా చాలా రిచ్ గా ఉండేలా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తైన తర్వాత ఈ చిత్ర టీం ఓ లాంగ్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనున్నారు. కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజ మ్యూజిక్ అందిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :