పూర్తైన రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడెలే’ షెడ్యూల్

Published on Jun 18, 2014 6:58 pm IST

Govindu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా నానక్రామ్ గూడాలో వేసిన ఓ హౌస్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ ఈ రోజుతో ముగిసింది. ఈ షెడ్యూల్ లో భాగంగా రెండు పాటలను, కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జూన్ 21 నుంచి మొదలు కానుంది.

రామ్ చరణ్ సరసన నాలుగోసారి కాజల్ అగర్వాల్ జోడీ కడుతున్న ఈ సినిమాకి కృష్ణ వంశీ డైరెక్టర్. ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. లోకల్ లో షూటింగ్ పూర్తి చేసుకొని ఆగష్టులో ఈ చిత్ర టీం ఓ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనున్నారు.

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :