‘కింగ్డమ్’ ఎఫెక్ట్.. గౌతమ్ నెక్స్ట్ ఏంటి..?

‘కింగ్డమ్’ ఎఫెక్ట్.. గౌతమ్ నెక్స్ట్ ఏంటి..?

Published on Aug 15, 2025 2:02 AM IST

Gowtam-Tinnanuri

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మంచి అంచనాలతో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఆయన ఈ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర మంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని అందరూ అనుకున్నారు.

ఆయన నానితో తెరకెక్కించిన ‘జెర్సీ’ ఎలాంటి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘కింగ్డమ్’ కూడా అదే స్థాయిలో అలరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, సినిమా రిలీజ్ తర్వాత ఫలితం మారడంతో, ఇప్పుడు గౌతమ్ అయోమయంలో పడ్డాడు. గతంలో రామ్ చరణ్‌కు ఓ కథను వివరించినా, ఆయన నుంచి ఓకే సిగ్నల్ రాలేదు.

ఇప్పుడు కింగ్డమ్ రిజల్ట్ తర్వాత ఆయనతో సినిమా చేసేందుకు ఏ హీరో రెడీ అవుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు