‘ఎన్టీఆర్’ బయోపిక్ లాంచ్ కు భారీ ఏర్పాట్లు !

నందమూరి బాలక్రిష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. నందమూరి తారకరామారావుగారి సినీ, రాజకీయ జీవితాల్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందనుంది. దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈరోజు హైదరాబాద్లోని నానకరామ్ గూడలో ఉన్న రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరగనుంది.

ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు ముఖ్య అతిధిగా హాజరుకానుండటంతో నిర్వాహకులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఉదయం 9 గంటల 42 నిముషాలకు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకానుండటంతో వారికి కూడ తగిన ఏర్పాట్లను చేయించారు బాలక్రిష్ణ.