‘బస్తీ’తో గ్రాండ్ గా లాంచ్ అయిన జయసుధ కుమారుడు

basthi
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కరు సక్సెస్ అయ్యాక వారి ఫ్యామిలీ నుంచి హీరోలు, హీరోయిన్స్ వస్తూ ఉండడం కామన్ గా జరిగే విషయం. ఇదే బాటలో అలనాటి స్టార్ హీరోయిన్, ఇప్పటికీ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జయసుధ కుమారుడు శ్రేయాన్ కపూర్ త్వరలోనే హీరోగా తెలుగులో పరిచయం కానున్నాడు. శ్రేయాన్ కపూర్ సినిమాని కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టి అప్పుడే సినిమా షూటింగ్ ని చివరి దశకు తీసుకువచ్చారు. దాంతో ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేసి, సినిమా గురించిన పూర్తి వివరాలను ఈ చిత్ర టీం తెలియజేసింది.

శ్రేయాన్ కపూర్ మొదటి సినిమాకి ‘బస్తీ’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. టింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియోని జూన్ 21న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ సినిమా ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా కాజరు కానున్నాడు. ఈ వేడుక కోసం శిల్పకళ వేదికని వెన్యూగా ఫిక్స్ చేసారు. ప్రగతి చౌరస్య హీరోయిన్ గా పరిచయం కానుంది. వాసు మంతెన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

Exit mobile version