గ్రాండ్‌గా ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ ప్రీమియర్స్.. తారల రాకతో సందడి వాతావరణం..!

గ్రాండ్‌గా ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ ప్రీమియర్స్.. తారల రాకతో సందడి వాతావరణం..!

Published on Jun 16, 2026 7:28 AM IST

తెలుగు ఓటీటీ రంగంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే రెండు సీజన్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఇప్పుడు రాబోతున్న మూడో సీజన్ ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’కి సంబంధించిన గ్రాండ్ ప్రీమియర్ వేడుక సోమవారం(జూన్ 15) సాయంత్రం హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

ఈ ప్రీమియర్ షోకు పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు, నటీనటులు, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ మెంబర్స్ హాజరయ్యారు. ఈ గ్రాండ్ ప్రీమియర్ చూసిన అతిథుల నుంచి ఈ సరికొత్త సీజన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్‌లో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, బిగ్ బాస్ విజేతలు వీజే సన్నీ, కళ్యాణ్ పడాలా.. చైతన్య రావు, రాగ్ మయూర్, కామాక్షి భాస్కర్ల, నిరుపమ్, ముక్కు అవినాష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

ఇక ఈ సిరీస్‌లో నటించిన ప్రియదర్శి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత తదితరుల నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా మూడు జంటల కథతో పాటు వెన్నెల కిషోర్ చేసిన ప్రత్యేక పాత్ర ఈ సీజన్‌లో హైలైట్‌గా నిలిచిందని పలువురు కామెంట్ చేశారు. మొదటి రెండు సీజన్లతో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్‌గా వ్యూయర్‌షిప్ రికార్డులు సృష్టించిన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్ 3లో సరికొత్త ఫ్యాంటసీ ట్విస్ట్‌తో అలరించడానికి సిద్ధమైంది.

‘రెండు ప్రపంచాలు ఢీకొట్టేలా చేసిన గర్జన’ అంటూ మేకర్స్ పెంచిన అంచనాలకు తగ్గట్టే టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ వెబ్ సిరీస్ జూన్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ వెబ్ సిరీస్‌కు మహి వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేటర్స్‌గా వ్యవహరించగా, శ్రీరామ్ ఎరగం డైరెక్ట్ చేశారు. అజయ్ అరసాడ సంగీతం అందించిన ఈ సిరీస్‌ను శివ మేక, సాహితి చింతలపూడి ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు