ఓవర్సీస్లో మంచి రిలీజ్ పొందనున్న ‘కిరాక్ పార్టి’ !
Published on Mar 8, 2018 1:34 pm IST

యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం ‘కిరాక్ పార్టి’ ఈ నెల 16న విడుదలకానుంది. ట్రైలర్, పాటలు, ప్రమోషన్లతో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి స్థాయిలో విడుదలకానుంది. దీంతో మొదటి వారంలోనే డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడి వెనక్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఓవర్సీస్లో కూడ ఈ చిత్రానికి మంచి విడుదల లభించనుంది.

మార్చి 15 న ప్రీమియర్ల రూపంలో సుమారు 130 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. నిఖిల్ కు ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద విడుదలని చెప్పొచ్చు. ట్రెండీ సినిమాస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కిరిక్ పార్టి’ కీ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశారు.

 
Like us on Facebook