ఎన్టీఆర్ ట్రాక్ లో గొప్ప లవ్ స్టోరీ ?

Published on Apr 25, 2021 3:00 am IST

ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ‘కొమరం భీం’ పాత్రలో ‘ఎన్టీఆర్’ నటిస్తున్నాడు. అడవితల్లి బిడ్డ అయిన భీమ్ అడవిజాతి బాగు కోసం బతుకును ధారపోసి ప్రాణాలను వదిలిన త్యాగమూర్తీ. కాగా ఆయన జీవితంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారని రూమర్స్ ఉన్నాయి. అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తారట. ఈ ఇద్దరు హీరోయిన్స్ చుట్టే రాజమౌళి గొప్ప ప్రేమ కథను అల్లాడని.. ఎన్టీఆర్ ట్రాక్ లో గొప్ప లవ్ స్టోరీ ఉండబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాను ఏకంగా 10 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీ పై నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి బయ్యర్లు వెనుకాడరు.

సంబంధిత సమాచారం :