పొల్లాచిలో రామ్ చరణ్ పాట షూటింగ్

Published on Mar 14, 2014 8:54 am IST

Ram-Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ పొల్లాచిలో జరుగుతుంది. అక్కడ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ పై పచ్చదనం వున్న ప్రాంతాల్లో ఒక పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ పాట పచ్చదనం థీమ్ ని కలిగి ఉండవచ్చునని బావిస్తున్నారు. కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, కమలినీ ముఖెర్జీ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ పొల్లాచిలో ఈ నెల 26 వరకు జరిగే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :