అక్టోబర్ 10న వస్తున్న గులాబి..!

అక్టోబర్ 10న వస్తున్న గులాబి..!

Published on Oct 2, 2014 3:00 PM IST

gulabi

శ్రీ గోగిశెట్టి క్రియేషన్స్ పతాకంపై మాదాల కోటేశ్వర రావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘గులాబి’. నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నేటి సమాజంలో… నిర్భయ భారతంలో, అభాగ్య నగరాలలో జరుగుతున్న సంఘటనల సమాహారమే మా గులాబీ చిత్రం. భాదితులకు సత్వర న్యాయం జరగాలనేది మా కాన్సెప్ట్. ఇటివలే సినిమా చూసిన సెన్సార్ సభ్యులు దర్శకనిర్మాతను మంచి సినిమా తీశావంటూ ప్రశంసించారు. సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. పవన్ శేష అందించిన సంగీతం అందరినీ అలరిస్తోంది. అక్టోబర్ 10న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని దర్శకనిర్మాత మాదాల కోటేశ్వర రావు అన్నారు.

మాదాల హరికృష్ణ, గోగిశెట్టి సునీల్, ప్రదీప్ రెడ్డి, అలేఖ్య, శ్రీజ, రూప, మహేష్, శ్రీధర్ రెడ్డి, ఎఫ్ ఎం బాబాయ్, డా. మధు బాబు, భాస్కర్ రాజు, మహంతి తదితరులు నటించిన ఈ చిత్రానికి పవన్ శేష సంగీతం అందించారు.

తాజా వార్తలు