గల్లీబాయ్ కలెక్షన్లు రెండో రోజు డ్రాప్ అయ్యాయి !

గల్లీబాయ్ కలెక్షన్లు రెండో రోజు డ్రాప్ అయ్యాయి !

Published on Feb 16, 2019 5:42 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం ‘గల్లీబాయ్’ ఈ నెల 14న బారి స్థాయిలో విడుదలై పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే రెండవ రోజు కలెక్షన్స్ కొంచెం డ్రాప్ అయ్యాయి. ఈసినిమా మొదటి రోజు 19.40 కోట్లు రాబట్టగా నిన్న 13.10 కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం. రెండు రోజులకు గాను ఈ చిత్రం దేశవ్యాప్తంగా 32.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈచిత్రం ఈరోజు రేపు భారీగా కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.

మ్యూజికల్ డ్రామా నేపథ్యంలో జోయా అక్తర్ తెరకెక్కించిన ఈచిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు