మహాభారతంలోని అద్భుతమైన ప్రేమ కథను తెరకెక్కించనున్న గుణశేఖర్

మహాభారతంలోని అద్భుతమైన ప్రేమ కథను తెరకెక్కించనున్న గుణశేఖర్

Published on Oct 9, 2020 9:24 PM IST

gunasekar

‘రుద్రమదేవి’ చిత్రంతో పిరియాడికల్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయడంలో తన ప్రతిభను కనబర్చిన సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తన తర్వాతి చిత్రంగా ‘శకుంతలం’ను ప్రకటించారు. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల అద్భుతమైన, అందమైన ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నారు. ఇది శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ. ఒకనాడు వేట కోసం అడవికి వెళ్లిన దుష్యంత మహారాజు కణ్వ మహర్షి పెంపుడు కుమార్తె శకుంతలను చూసి మనసుపడి మహర్షి అంగీకారంతో వివాహం చేసుకుంటాడు. శకుంతల విశ్వామిత్రుడు, మేనకల కుమారై.

ఆమె పుట్టుక మహాభారత ఆదిపర్వంలో ఒక ఆసక్తికర ఘట్టం. దుష్యంతుడితో ఆమె ప్రేమ, వారి గాంధర్వ వివాహం, కష్టాలు పడటం ఇలా అనేక అంశాలు శకుంతల ప్రేమ కథలో మిలిళితమై ఉంటాయి. మరి ఈ కథకు సినిమాటిక్ టచ్ ఇచ్చి గుణశేఖర్ ‘శకుంతలం’ సినిమాను ఎంత అందంగా, ఆహ్లాదంగా తెరకెక్కిస్తారో చూడాలి. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమారై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెలొడీబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచనున్నారు. ఇకపోతే ఇందులో హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

నిజానికి గుణశేఖర్ రానాతో ‘హిరణ్యకశ్యప’ అనే చిత్రం చేయాల్సి ఉంది. ప్రీప్రొడక్షన్ వర్క్ సైతం కంప్లీట్ అయింది. కానీ లాక్ డౌన్ కారణంగా ప్రాజెక్ట్ టేకాఫ్ కావడానికి ఇంకా సమయం ఉండటంతో ఈలోపు ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ‘శకుంతలం’ సినిమాను అనౌన్స్ చేశారాయన.

తాజా వార్తలు