సీరియర్ డైరెక్టర్ గుణశేఖర్ వర్కింగ్ స్టైల్ గురించి అందరికీ తెలుసు. డిమాండ్ చేస్తే ఒక్క సన్నివేశమైనా సరే భారీ సెట్టింగులు వేస్తారు. అందుకే ఆయన సినిమాల్లోని సన్నివేశాలు చెక్కినట్టే ఉంటాయి. ‘ఒక్కడు, సైనికుడు, వరుడు, రుద్రమదేవి, అర్జున్’ చిత్రాల్లో సెట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ ‘శాకుంతలం’. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల అద్భుతమైన, అందమైన ప్రేమ కథ ఇది.
కమర్షియల్ సినిమాలకే భారీ సెట్ వర్క్ చేసే గుణశేఖర్ ఇలాంటి మైథలాజికల్ సబ్జెక్ట్ అంటే సన్నాహాలు మామూలుగా ఉండవు కదా. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్టూడియోలో భారీ సెట్టింగ్ ప్లాన్ చేస్తున్నారు గుణశేఖర్. ఏర్పాట్లు చూస్తుంటే సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమారై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెలొడీబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచనున్నారు. ఈ ప్రేమ కథలో విశ్వామిత్రుడు, మేనకల కుమారై, కణ్వ మహర్షి పెంపుడు కుమార్తె శకుంతల పాత్రలో స్టార్ నటి సమంత నటించనుంది. ఇక సినిమాలో దుష్యంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది.


