రూమర్స్ నమ్మద్దు అంటున్న గుణశేఖర్

రూమర్స్ నమ్మద్దు అంటున్న గుణశేఖర్

Published on Feb 28, 2016 5:43 PM IST

guna-shekar
భారీ బడ్జెట్ తో, భారీ సెట్టింగులతో సినిమాలు చేసే టాలీవుడ్ డైరెక్టర్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు గుణశేఖర్. ఆయన గత ఏడాది ఇండియన్ హిస్టారికల్ ఫిల్మ్ అయిన ‘రుద్రమదేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా చివర్లో కాకతీయ సామ్రాజ్యాన్ని చివరిగా పరిపాలించిన ‘ప్రతాపరుద్రుడు’ సీక్వెల్ చేస్తానని అనౌన్స్ చేసాడు. అందులో భాగంగానే గుణశేఖర్ ప్రస్తుతం ప్రతాప రుద్రుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా మొదలు పెడుతున్నాడు అని తెలిసిన కొద్ది రోజులకే ఈ సినిమాపై పుకార్లు రావడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా ప్రతాపరుద్రుడు పాత్రని యంగ్ రెబల్ స్టార్ ప్రభాష్ పోషించనున్నాడని, ప్రస్తుతం గుణశేఖర్ ప్రభాస్ ని అప్రోచ్ అయ్యే పనిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇలాంటి పుకార్లని నమ్మవద్దని గుణశేఖర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ‘మేము అధికారికంగా అనౌన్స్ చేసేంత వరకూ ప్రతాపరుద్రుడు లో నటించే నతెనటుల గురించి మీడియాలో పుకార్లను రాయకండి. మేమే అనౌన్స్ చేస్తామని’ గుణశేఖర్ మీడియాకు తెలిపాడు. అలాగే మీడియాలో వచ్చే పుకార్లని నమ్మవద్దని ప్రేక్షకులకు కూడా తెలిపాడు.

తాజా వార్తలు