జాన్వీ కొత్త సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ !

Published on Feb 26, 2019 5:11 pm IST

గత ఏడాది దఢక్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యువ హీరోయిన్ జాన్వీ కపూర్ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈచిత్రం తరువాత జాన్వీ ప్రస్తుతం భారత మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ లో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లక్నో లో జరుగుతుంది. తాజాగా ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యారు నటుడు అంగద్ బేడీ. ఈ చిత్రంలో అంగద్ ,జాన్వీ కి సోదరుడిగా కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రానికి ‘కార్గిల్ గర్ల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం కోసం జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ తీసుకుంది. ఈసినిమా తో పాటు జాన్వీ ,కరణ్ జోహార్ నిర్మించనున్న ‘తఖ్త్’ అనే మల్టీ స్టార్టర్ కు కూడా సైన్ చేసింది.

సంబంధిత సమాచారం :