విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ‘గుర్తుకొస్తున్నాయి’ !

Published on Apr 22, 2019 8:45 am IST

నూతన నటుడు ఉదయ్ హీరోగా ట్వింకిల్ అగర్వాల్ హీరోయిన్ గా యు ఆర్ క్రియేషన్స్ పతాకం పై రాజేష్ సి.హెచ్ దర్శకత్వంలో బంగార్రాజు నిర్మిస్తోన్న క్యూట్ లవ్ స్టోరీ ‘గుర్తుకొస్తున్నాయి’. 1980 విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే టీనేజ్ ప్రేమకథ ఇది. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఏప్రిల్ 22న హైదరాబాద్ లోని వేంకటేశ్వరస్వామి దైవ సన్నిధానంలో వైభవంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా హీరో ఉదయ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో స్కూల్ బోయ్ గా నటిస్తున్నాను. టీనేజ్ లో జరిగే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది.. అన్నారు. నిర్మాత బంగార్రాజు మాట్లాడుతూ.. ఎప్పటినుంచో ఒక మంచి సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఆ టైములో రాజేష్ చెప్పిన కథ బాగా నచ్చింది. పల్లెటూరి వాతావరణంలో జెరిగే స్వచ్ఛమైన, అందమైన లవ్ స్టోరీ ఇది. మే 1నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సింగల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేస్తాం అన్నారు.

ఉదయ్, ట్వింకిల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ బాబీ, పవన్ కుమార్, రఘుతో పాటు ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా; శివ.కె, సంగీతం; మార్క్ ప్రశాంత్, నిర్మాత; బంగార్రాజు, కథ-మాటలు-స్క్రీన్ ప్లై-దర్శకత్వం; రాజేష్ సి.హెచ్.

సంబంధిత సమాచారం :