ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన గురు ఫిలిమ్స్!

Published on Aug 31, 2021 7:41 pm IST

సమంత తో ఓహ్ బేబీ చిత్రాన్ని నిర్మించిన గురు ఫిల్మ్స్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నారు. మొదటి ఇంటర్నేషల్ ప్రాజెక్ట్ అంటూ తాజాగా గురు ఫిలిమ్స్ ఒక ప్రకటన చేయడం జరిగింది. అరెంజ్మెమెంట్స్ ఆఫ్ లవ్ పేరిట ఒక ఇంటర్నెషనల్ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇది తిమెరి ఎన్. మురారి రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. దీనికి రచన మరియు దర్శకత్వం ఫిలిప్ జాన్ అందిస్తున్నారు. కో రైటర్ గా నిమ్మి హరస్గామ వ్యవహరిస్తున్నారు. సునీత తాటి ఈ చిత్రాన్ని గురు ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :