‘గురు’తన కెరీర్లో ప్రత్యేకమైన సినిమా అంటున్న వెంకీ !

5th, April 2017 - 08:38:40 AM


విక్టరీ వెంకటేష్ పూర్తిగా తన రెగ్యులర్ స్టైల్ ను మార్చి కొత్తగా చేసిన సినిమా ‘గురు’. గత నెల 31వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హవా చూపిస్తోంది. ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఉన్నా ప్రీమియర్ షోల ద్వారా, ఆ తర్వాతి రెగ్యులర్ షోల ద్వారా వ్యాపించిన పాజిటివ్ టాక్ తో ఇప్పుడు దూసుకుపోతోంది. వీక్ డేస్ లో సైతం సినిమా హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది.

అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సందర్బంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయుడని చిత్ర యూనిట్. ఇందులో హీరో వెంకటేష్ మాట్లాడుతూ మంచి సినిమా విజయం సాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నాళ్ళ నుండో ఇలాంటి భిన్నమైన సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాల నా కెరీర్లో ఒక మెయిలు రాయిగా మిగిలిపోతుంది. ఇది నాకొక ప్రత్యేకమైన చిత్రం అన్నారు. తమిళ ‘ఇరుద్ది సుట్రు’ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాను ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన సుధా కొంగర డైరెక్ట్ చేశారు.