బరిలోకి దిగిపోయిన వెంకటేష్..!

guru
విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో కొద్దికాలం పాటు ఇచ్చిన గ్యాప్‌ను భర్తీ చేస్తూ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమధ్యే ‘బాబు బంగారం’ అనే సినిమాతో మెప్పించిన ఆయన, తాజాగా ‘గురు’ అనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళారు. తమిళ, హిందీ భాషల్లో మంచి విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’కు రీమేక్‌గా గురు సినిమా తెరకెక్కుతోంది. వైజాగ్‌లోనే ఎక్కువభాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ నేడు వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో మొదలైంది.

సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తోనే అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా వెంకీ రఫ్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పక్కా ప్లాన్‌తో అతి తక్కువ వర్కింగ్ డేస్‌లో సినిమాను పూర్తి చేయాలని గురు టీమ్ ప్లాన్ చేస్తోంది. వై నాట్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రితికా సింగ్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఓ బాక్సింగ్ కోచ్‍గా వెంకీ ఈ సినిమాలో కనిపించనున్నారు.