గోపీచంద్ సినిమాలో హంసా నందిని !
Published on Feb 21, 2018 8:58 am IST

హంసా నందిని.. ఈ పేరు వినగానే పలువురు స్టార్ హీరోల సినిమాల్లో బంపర్ హిట్లుగా నిలిచిన ప్రత్యేక గీతాలే గుర్తొస్తాయి. ఇటీవలే ఎన్టీఆర్ యొక్క ‘జై లవ కుశ’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించిన ఈమె గోపీచంద్ యొక్క 25వ సినిమా ‘పంతం’లో కనబడనుంది. దర్శకుడు కె.చక్రవర్తి చెప్పిన కథ నచ్చడంతో ఆమె ఈ సినిమాకు ఒపుకున్నారట.

ఇందులో తాను డబ్బున్న ధనవంతురాలిగా క్లాసీ లుక్లో కనిపిస్తానని, స్పెషల్ సాంగ్ లాంటివి చేయడంలేదని, ఈ పాత్రతో తనకు మంచు గుర్తింపు లభిస్తుందని ఆమె ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికతో అన్నారు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను మే 18న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

 
Like us on Facebook