పవన్ కళ్యాణ్‌పై కామెంట్ చేయలేదు – హన్సిక

పవన్ కళ్యాణ్‌పై కామెంట్ చేయలేదు – హన్సిక

Published on Mar 11, 2015 3:06 PM IST

Hansika-pawan-kalyan
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై హన్సిక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటూ వెబ్ మీడియాలో గత రెండు రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ప్రజా సేవ చేయాలంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం లేదు అని తాజా ఇంటర్వ్యూలో హన్సిక చెప్పిందట. పవన్‌తో సహా రాజకీయాలలో ఉన్న ప్రతి హీరోపై చాలా తెలివిగా సెటైర్ వేసిందని గాసిప్పురాయుళ్ళు వార్తలు రాశారు. వీటిని హన్సిక ఖండించింది.

‘పవన్ కళ్యాణ్ సర్ గురించి నేను కామెంట్ చేసినట్టు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. పవన్ పేరును ప్రస్తావిస్తూ.. నేను ఎవరికీ ఎటువంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అతను అంటే నాకు చాలా గౌరవం. అయన అభిమానిని కూడా. ఇటువంటి అర్ధంపర్ధం లేని పుకార్లను స్ప్రెడ్ చేయవద్దని నేను అందరిని కోరుతున్నాను.’ అంటూ సోషల్ మీడియాలో హన్సిక వివరణ ఇచ్చింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు