“మై నేమ్ ఈజ్ శృతి” అంటున్న హన్సిక!

Published on Jul 4, 2021 3:58 pm IST

హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమం తో ప్రారంభం కాగా, ఈ చిత్ర దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉందని మనం జనరల్ గా మాట్లాడుకుంటాం, అలాగే ఒక అమ్మాయి సంఘర్షణ వెనుక కూడా ఒక మగాడే ఉంటాడు అంటూ చెప్పుకొచ్చారు. అలాంటి ఒక సంఘర్షణ ఎదుర్కొన్న అమ్మాయి కథనే ఈ మై నేమ్ ఈజ్ శృతి అని వ్యాఖ్యానించారు. తనను తాను ఎలా కాపాడుకుంది అనేది ఈ చిత్రం స్టోరీ అంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు.

అయితే ఈ చిత్రం గురించి హన్సిక మాట్లాడుతూ, ఇది నా 52 వ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు లో మళ్లీ చేస్తున్నందుకు సంతోషం గా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగు లోనే తన కెరీర్ ను మొదలు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా తెలుగు సినిమా తనను ఒక నటిగా చేసింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే మై నేమ్ ఈజ్ శృతి చిత్రం లో భాగం అయినందుకు చాలా సంతోషం గా ఉందని అన్నారు. అయితే ఈ చిత్రం లో ఎన్నో ట్విస్ట్ లు, మలుపు లు ఉన్నాయి అని, ఒక నటిగా కథ విన్నాక చాలా బాగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం అవుతుంది అంటూ దర్శకులు చెప్పుకొచ్చారు. సెకండ్ షెడ్యూల్ జూలై చివరి వారం నుండి ఉంటుంది అని తెలిపారు.

అయితే ఈ చిత్రం ను వైష్ణవి ఆర్ట్స్ పతాకం పై రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం :